రెండో టీ20లో బంగ్లాదేశ్‌కు 222 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత జట్టులో నితీష్ రెడ్డి 74 పరుగులు, రింకూ సింగ్ 53 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు.బంగ్లాదేశ్ తరపున రిషాద్ హుస్సేన్ 3 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, తంజిమ్ హసన్ సాకిబ్ తలో వికెట్ తీశారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హసన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, మస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్.