ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుదీనా టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి...

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 02:09 PM

ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న బరువు చాలామంది (ఊబకాయం ఉన్నవారు) కి పెను సమస్యగా మారింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాలామంది బరువు తగ్గడం లేదని పేర్కొంటుంటారు..అయితే.. ఇలాంటి సమస్యలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. పుదీనా రసం లేదా పుదీనా టీ రోజూ తీసుకుంటే 10 రోజుల్లో బరువు తగ్గవచ్చు. ఇది అనేక సమస్యలను అధిగమించడానికి సహాయపడే పోషకాలను కలిగి ఉంటుందని.. బరువు కూడా ఈజీగా తగ్గుతుందని చెబుతున్నారు. పుదీనా టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.


నిద్రలేమి దూరం: నిద్రలేమి సమస్య ఉన్నవారికి సైతం పుదీనా రసం లేదా టీ మేలు చేస్తుంది. పుదీనా నిద్రను ప్రోత్సహించడం ద్వారా నిద్రలేమి సమస్యను సులభంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది.


రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పుదీనా టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే దీనిలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక గుణాలు ఉన్నాయి. దీంతో జలుబు, దగ్గు తదితర సమస్యలు దూరమవుతాయి. ఈ టీ తాగడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ సమస్య కూడా తొలగిపోతుంది.నోటి దుర్వాసన దూరం: నోటి దుర్వాసనను పోగొట్టడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల నోటిలో ఎక్కువ సేపు తాజాదనం నిండి ఉంటుంది. కాబట్టి, నోటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి మీరు పుదీనా టీ తాగవచ్చు.పుదీనా టీ ఎలా తయారు చేయాలంటే..: పుదీనా టీ చేయడానికి, ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు వేసి బాగా మరిగించాలి. కొంచెం టీ పొడి వేసి కొన్ని పుదీనా ఆకులను వేసి మరిగించాలి. ఆ తర్వాత వడపోసుకుని తాగవచ్చు.. ఇంకా కావాలంటే.. వీటిలో నిమ్మ లేదా తేనెతో కలుపుకుని తాగవచ్చు.. (నోట్: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com