న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఎదురీదుతోంది.171 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ మరో మూడు పరుగు జోడించి 174 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో భారత్ 147 పరుగులు చేస్తే ఈ టెస్ట్‌లో విజయం సాధిస్తుంది. కానీ, కివీస్ బౌలర్ల ధాటికి భారత టాపార్డర్ విలవిలాడారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (5) పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ (11) పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు.అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (1) కూడా అదే బాటలో పెవీలియన్ చేరారు. ఇక మొదటి టెస్ట్ సెంచరీ హీరో, టెస్ట్ స్పెషలిస్ట్ సర్ఫరాజ్ ఖాన్ (Surfaraz Khan) (1) పరుగు మాత్రమే చేసి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా (Team India) 5 కీలక వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (Rishabh Panth) 13 బంతుల్లో 18 పరుగులు, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 9 బంతుల్లో 3 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ (New Zealand) బౌలర్లలో స్పిన్నర్ ఎజాజ్ పటేల్ (Azaz Patel) 3 వికెట్లు, మ్యాట్ హెన్రీ (Matt Henry), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Philips) చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత్ ఈ టెస్ట్‌లో విజయం సాధించాలంటే మరో 106 పరుగులు చేయాల్సి ఉంది.