ప్రతి రోజూ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. టిఫిన్కు బదులుగా వైట్ బ్రెడ్ తినడం కూడా కరెక్ట్ కాదంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదంటున్నారు. ఇలా ఉదయాన్నేఇవి తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పాలల్లో వీటిని కలిపి అసలు తాగొద్దు!
వేసవిలో చల్లగా ఉండేందుకు కూల్ డ్రింక్స్, ఫ్రూట్ షేక్స్, జ్యూస్లు, కొబ్బరి బొండాలు వంటివి తాగుతుంటారు. అయితే, ఫ్రూట్ సలాడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని రకాల పండ్లలో పాలను కలిపితే విషపూరితంగా మారే అవకాశం ఉంది. పాలలో నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్, బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్, జామ, అరటి పండు వంటివి కలపడం మంచిది కాదు. ఇలాంటి వాటిని తీసుకోకుడదని హెచ్చరిస్తున్నారు.