టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఇవాళ (నవంబర్ 5) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడూ చూడని ఈ ఫొటోలో విరాట్ తన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని కనిపించాడు. కొడుకు అకాయ్ని క్యారియర్లో పట్టుకొని ఉండగా.. కూతురు వామికను మరో చేత్తో పట్టుకున్నాడు. ఇద్దరినీ చూస్తూ విరాట్ మురిసిపోతూ నవ్వుతుండడం ఈ ఫొటోలో కనిపిస్తోంది. అయితే పిల్లల ముఖాలను హార్ట్ ఎమోజీలతో కవర్ చేసింది.గార్డెన్లో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో ఈ ఫొటోను తీశారు. విరాట్ బ్రౌన్ కలర్ జీన్స్, వైట్ టీ షర్ట్ ధరించి కనిపించగా.. కూతురు వామిక జీన్స్, టీ-షర్ట్, రెండు జడలతో ఉంది. అకాయ్ కూడా టీ-షర్ట్ ధరించాడు. బర్త్ డే విషెస్ చెబుతూ అనుష్క శర్మ షేర్ చేసిన ఈ ఫొటో కోహ్లీ అభిమానుల హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ ఫొటో నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వామిక, అకాయ్ ఎంత ఎదిగిపోయారంటూ ఓ అభిమాని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కోహ్లీ బర్త్ డే నాడు ఇంతకు మించిన విలువైన బహుమతి ఏమీలేదని మరో ఫ్యాన్ పేర్కొన్నాడు. కాగా కోహ్లీ కొడుకు అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న జన్మించాడు. అయితే వ్యక్తిగత ప్రైవసీ కారణాలతో అనుష్క శర్మ ఇద్దరు పిల్లలతో లండన్లోనే నివాసం ఉంటోంది. అందుకే విరాట్ కోహ్లీ సమయం చిక్కినప్పుడల్లా లండన్ వెళ్తున్నాడు. ప్రైవసీ కారణాలతోనే పిల్లల ముఖాలను విరాట్-అనుష్క దంపతులు బాహ్య ప్రపంచానికి చూపించడం లేదన్న సంగతి తెలిసిందే