భారత్ - దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగే రెండో టీ20 మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ వేదిక సెయింట్ జార్జ్ పార్క్ స్టేడియంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆక్యూవెదర్ ప్రకారం.. టాస్ సమయంలో వర్షం 49 శాతం నుంచి 54 శాతం మధ్య కురుస్తుంది. రాత్రి 8 గంటలకు 63 శాతం.. రెండో ఇన్నింగ్స్ 40 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే, మ్యాచ్ మొత్తం రద్దయ్యే అవకాశాలు కనిపించడం లేదు.