భారత మాజీ క్రికెటర్ ధోనీకి తాజాగా జార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్యదాస్ తనను రూ.15 కోట్లు మోసం చేశారని జనవరి 5న రాంచీలో ధోని ఫిర్యాదు చేశారు.
అయితే స్థానిక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులిచ్చింది.