ఈ నెల 22న జరిగే హెచ్.ఆర్ సమావేశంలో విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పీస్ రేటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు నగర కన్వీనర్ ఆర్. ప్రకాశరావు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో ఇ.ఇ టెక్నికల్ జి. సురేష్ బాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెన్ కో, ట్రాన్ కో తదితర డిస్కంలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరిని రెగ్యులర్ చేయాలన్నారు.