రాజాం నియోజకవర్గంలో పది ఆసుపత్రుల్లో వైద్యుల కొరత అధికంగా ఉందని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన నియోజకవర్గ సమస్యలు సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పశు దాణా రేట్లు అధికంగా ఉండటంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దాణా రేట్లు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.