వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన జలుమూరు మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే రమణమూర్తి అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడడం ఆపాలని ఎంపీపీ వాన గోపి, మండల అధ్యక్షుడు సీతారాం, శ్యామలరావు, మన్మధరావు అన్నారు.
జలుమూరు మండలం చల్లవానిపేటలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కొమ్మనాపల్లి బ్రిడ్జి, జర్జంగి-పిండ్రువాడ రోడ్డు, సచివాలయాలు తదితర నిర్మాణాలు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన హయాంలోనే జరిగాయని అన్నారు.