రాష్టంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, కనీస వేతనాలు ఇచ్చి, ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేసారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాల అవుట్ సోర్సింగ్ బోధన సిబ్బంది చాలిచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలన్నారు.