ప్రముఖ సినీహీరో ప్రభాస్‌తో రిలేషన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ మోహన్ రెడ్డి , ఆదానీలపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో చూయించారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు.
అప్పుడు గాడిదలు కాశారా. విచారణ ఎందుకు చేయలేదు. ప్రభాస్‌కు నాకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా. మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఈ ప్రచారం చేయించారు. నా వీడియో చూయించి జగన్ సానుభూతి పొందాలని చూశారు. జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు ...నాన్న పేరు సీబీఐ చార్జి షీట్లో పెడతారు.. తనపై దుష్ప్రచారం చేయిస్తారు’’ అని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.