కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయింది అని షర్మిల వాపోయారు. ఆమె మాట్లాడుతూ..... రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయింది. కానీ ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు వెళ్లడం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కడప స్టీల్ ప్లాంట్ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు. అప్పుడు అధికారంలోకి వచ్చిన మా అన్న జగన్.. ఆస్కార్ డైలాగ్స్ చెప్పి మళ్లీ టెంకాయ కొట్టి మరో సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
జమ్మలమడుగు రుణం తీర్చుకుంటానని చెప్పి వారిని మోసం చేశారు. సజ్జన్ జిందాల్, జగన్ మోహన్ రెడ్డి బంధం ఎలాంటిదో సీఎంగా జగన్ దిగిపోయిన తర్వాత ఏపీ ప్రజలకు అర్థమయ్యింది. కడప స్టీల్ ప్లాంట్‌పై పాలకులకు ఎందుకంత చిన్నచూపే అర్థం కావడం లేదు. వివేకా హత్య కేసులో వేగం పెరగడం శుభపరిణామం. ఇప్పటికైనా సునీత, సౌభాగ్యమ్మకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. బాధితురాలైన సునీతకు తానెప్పుడూ అండగానే ఉంటా" అని షర్మిల చెప్పారు.