ఒంగోలు నగరంలోని గాంధీపార్కును అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆ పార్టీకి చెందిన నగర బృందం గాంధీ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఆట వస్తువులు ఉన్న స్థలంలో గత నాలుగేళ్ళుగా ఇసుక వేయనందున పిల్లలు పడి దెబ్బలు తగులుతున్నాయన్నారు. తక్షణమే ఇసుక వేయడంతో పాటు ఊయలలు కొత్తవి ఏర్పాటు చేయాలని, జారుడుబండలకు మధ్యలో రంధ్రాలు పడ్డాయ ని, వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రతి ఆదివారం ఎక్కువ సంఖ్యలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వస్తున్నారని, అందువల్ల అన్ని పార్కులో అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్కు ఉత్తరం వైపున ప్రహరీ కూలిపోయిందని, దానిని వెంటనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జి.రమేష్, తంబి శ్రీనివాసులు, టి.మ హేష్, ఎస్‌డీ.హుస్సేన్, దామా శ్రీనివాసులు తదితరు లు పాల్గొన్నారు.