కర్నూలులో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించవద్దంటూ పత్తికొండ న్యాయవాదులు ఒక రోజు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి ఆద్వర్యంలో న్యాయవా దులు నాలుగు స్థంభాల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతమైన కర్నూ లులో న్యాయసంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం వీటిని అమరావతికి తరలించాలని చూస్తే ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదులు హుల్తన్న, నాగభూషణం రెడ్డి, అశోక్ కుమార్, రాజశేకర్ నాయుడు, మహేష్, ఎల్లారెడ్డి, సత్యనారాయణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.