పశువుల్లో బ్రూసెల్లా వ్యాధి నివారణ కోసం టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ బేబీరాణి తెలిపారు. గురువారం ఒంగోలు నగరం త్రోవగుంట పశువైద్యశాల వద్ద 4-8 నెలలు వయస్సు గల దూడలకు బ్రూసెల్లా వ్యాధి రాకుండా టీకాలు వేసే కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలుషిత ఆహారం, నీటిని తీసుకోవడం వల్ల దూడల్లో ఈ వ్యాధి వస్తుందని చెప్పారు. పడ్డల ను ఈ వ్యాధి సోకిన దున్నలు దాటటం వల్ల కూ డా సంక్రమిస్తుందని తెలిపారు. గర్భం ధరించిన ప శువులు ఈసుకపోవటం, కొన్నిసార్లు పశువు మృతి చెందుతుందని పేర్కొన్నారు. అందువల్ల రైతులు త మ దూడలకు తప్పకుండా బ్రూసెల్లా టీకాలు వే యించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ బస వశంకరరావు, పశువైద్యశాఖ అధికారి లక్ష్మయ్య, ఆర్. ప్రగతి, మాధవాచారి, రైతులు పాల్గొన్నారు.