కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఏఎఫ్ ఎకాలజీ భవనంలో సోమవారం డివిజన స్థాయి ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జిల్లాస్థాయి, డివిజన స్థాయి అధికారులు హాజరయ్యారు. ఇందులో కలెక్టర్కు రైతులు, ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు పెద్దఎత్తున సమర్పించారు. సుమారు 662 వినతిపత్రాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి రావడానికి కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ ఎంతో కష్టపడాల్సి వస్తుందని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశామని తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రజల కష్టాలను తనవి భావిస్తున్నానని, వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.