మెదడుకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన 'జననీస్ ఎన్సెఫాలిటిస్' వ్యాధి 13 ఏళ్ల తరువాత మన దేశంలో మళ్ళీ వెలుగు చూసింది. పశ్చిమ ఢిల్లీ బిందాపూర్కు చెందిన 72 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి సోకింది. నవంబర్ 3న ఎయిమ్స్ చేరిన అతడికి వైద్య పరీక్షలు చేయగా ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధిలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని, దీన్ని వెంటనే కట్టడి చేయలేకపోతే ముప్పుగా మారే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.