మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గోండు మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి జరిపిన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. సుమారు రూ. 60 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు మురళిని అరెస్ట్ చేసి.. అర్ధరాత్రి విశాఖపట్నం తరలించి... ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు.కాగా ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళీ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఇటీవల ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఏసీబీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ అతుల్‌సింగ్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. గురువారం జిల్లాతోపాటు విశాఖలోనూ ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన బృందంతో మురళీ నివాసంతోపాటు విధులు నిర్వహించిన చోట, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు.