తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఇటీవల రమేశ్ అనే వ్యక్తి వాకింగ్‌కు వెళ్ళగా హత్యకు గురయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రమేశ్ భార్య విజయలక్ష్మికి ఇర్ఫాన్ (28) అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టు గుర్తించారు.
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో కిరాయి ముఠాతో చేతులు కలిపి భర్తను హత్య చేయించినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.