ప్రజల సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరించి, కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారాలపై అధికారులతో సమీక్షించారు. కొన్ని శాఖల అధికారులు లాగిన్ లో వచ్చిన దరఖాస్తులను ఓపెన్ చేసి చూడడం లేదన్నారు.