అచ్యుతాపురం మండలం మాటూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు. మంగళవారం అచ్యుతాపురం జనసేన పార్టీ కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ వారికి కండువాలు వేసి సాధారణగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఓపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.