చంద్రబాబు బీసీలకు తీవ్ర ద్రోహం చేశారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కూటమి రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళంలో అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కూటమి రాజ్యసభ సభ్యులను ప్రకటించారు, బీద మస్తాన్, సాన సతీష్, ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారు, కానీ ఈ మూడు నాడు వైయస్ జగన్ గారు బీసీలకు కేటాయించారు, బీసీలకు పెద్దపీట వేశారు కానీ వారు అమ్ముడుపోయి రాజీనామాలు చేశారు, బీద మస్తాన్ డబ్బులిచ్చి మళ్ళీ కొనుక్కున్నారు, మా మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మోపిదేవికి ఇస్తే ఆయన అమ్ముడుపోయారు, సానా సతీష్ అనే క్రిమినల్‌కు కట్టబెట్టారు, అతనిపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి, ఖురేషీ కేసులో ఏకంగా సీబీఐ వారికే రూ. రెండు కోట్లు లంచం ఇచ్చిన ఘనుడు ఆయన, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఆయన బినామీ కూడా, అందుకే రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నారు.
చంద్రబాబు చరిత్ర, సామాజిక న్యాయం చూస్తే బీసీలనుంచి రాజ్యసభ సీటు లాక్కుని మరొక బీసీకు అమ్ముకోవడం, మరోక బినామీకి ఇచ్చుకోవడమే సామాజిక న్యాయం. మన బీసీలందరిలో చైతన్యం రావాలి, బీసీలకు సామాజిక న్యాయం అందజేసింది వైయస్ జగన్ గారు మాత్రమే, చంద్రబాబు లాంటి వ్యక్తి బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నాడు, బీసీలంతా ఇది గమనించాలని సీదిరి అప్పలరాజు అన్నారు.