ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటిలో ఇదొక్కటి మరిగించి తాగితే కొలెస్ట్రాల్‌ కరగడంతో పాటు డయాబెటిస్, బీపీ కూడా కంట్రోల్

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 10:32 PM

మన వంటింట్లోనే ఆరోగ్యానికి మేలు చేసేవి ఎన్నో ఉన్నాయి. వాటిని మనం సరిగ్గా ఉపయోగించం. కానీ, వంటగదిలో దొరికే మసాలాలు, కొన్ని పదార్థాల్ని సరిగ్గా వాడితే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. అలాంటి వాటిలో వెల్లుల్లి ఒకటి. అలాంటి వెల్లుల్లిని ఇంటి నివారణల్లో ఉపయోగిస్తే రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇక, వెల్లుల్లి నీటిలో రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు తీవ్ర సమస్యల నుంచి శరీరాన్ని కాపాడతాయి. గార్లిక్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం.


వెల్లుల్లితో ప్రయోజనాలు..


​వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. LDL కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది చాలా మంచిది. ఇది మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డిఎల్ స్థాయిలు కూడా పెరిగేలా చేస్తుంది. వెల్లుల్లి తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను 10-15 శాతం తగ్గించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా జీవనశైలి సంబంధిత సమస్యలైన కొలెస్ట్రాల్, హై బ్లడ్ షుగర్, ఊబకాయం మొదలైన వాటిని తగ్గించడంలో సాయపడుతుంది. ఇక, వెల్లుల్లి నీటిలో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. ప్రయోజనాలు, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


రక్తపోటు అదుపులో ఉంటుంది


వెల్లుల్లి నీళ్లలో సహజసిద్ధమైన రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉన్నాయి. దీంతో అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా వెల్లుల్లి నీటిని తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


గుండె సంబంధిత సమస్యలకు చెక్..


వెల్లుల్లి నీటిని తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను 10-15 శాతం తగ్గించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గితే గుండె ఆరోగ్యం మెరగవుతుంది.


పీరియడ్స్ నొప్పుల నుంచి రిలీఫ్..


ప్రతి నెలా నాలుగైదు రోజుల పాటు పీరియడ్స్ సమయంలో మహిళలు భరించలేని నొప్పి బాధపడాల్సి వస్తుంది. ఈ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కడుపు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వెన్ను నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలతో బాధపడతారు. అప్పుడు మహిళలు గార్లిక్ వాటర్ తాగడం వల్ల పీరియడ్స్ పెయిన్ నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. ప్రధానంగా ఇది వెన్నునొప్పి, తిమ్మిర్లు, కడుపు నొప్పి ఉపశమనం కల్పిస్తుంది.


జలుబు, దగ్గు..


చలికాలంలో చాలా మంది జలబు, దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి వెల్లుల్లి నీరు మంచి ఆప్షన్. వెల్లుల్లి నీరు తాగడం వల్ల జలుబు నయమవుతుంది. దగ్గు తీవ్రత కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఈ సీజన్‍‌లో గొంతు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారికి గార్లిక్ వాటర్ చాలా హెల్ప్ అవుతుంది.


పేగు ఆరోగ్యం..


గార్లిక్ వాటర్ తాగడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అదే సమయంలో, చెడు బ్యాక్టీరియా నాశనమవుతుంది. దీని కారణంగా కడుపు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. ప్రధానంగా కడుపులో వాపు, నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో గార్లిక్ వాటర్ హెల్ప్ అవుతుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలనుకుంటే మీ ఆహారంలో వెల్లుల్లి నీటిని చేర్చుకోండి.


వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేయాలి?


గార్లిక్ వాటర్ చేయడానికి ముందుగా 2 గ్లాసుల నీటిని తీసుకుని వేడి చేయండి. అందులో 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు వేసి నీరు సగానికి తగ్గేలా మరిగించాలి. దీని తరువాత, నీటిని ఫిల్టర్ చేసి, చల్లార్చి త్రాగాలి. ఉదయం పూట ఖాళీ కడుపుతో వెలుల్లి నీరు తాగితే ఎన్నో లాభాలు చేకూరుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com