రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.