ఇళ్లకు పట్టాలిప్పి స్తామని కొంత మంది దళారులు అమాయకులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని ఎమ్మెల్యే షాజహాన బాషా పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె స్థానిక బీకేపల్లె రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..... కొంత మంది డీకేటీ భూములను ఆక్రమించుకుని అక్రమంగా విక్రయిస్తున్నారని, వారి మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులకు సిఫారసు చేస్తామన్నారు. డీకేటీ భూములు విక్రయించినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని గుర్తు చేశారు. అర్హులైన వారు నేరుగా దరఖాస్తు చేసుకుంటే ఎన్టీఆర్ గృహనిర్మాణం పథకం కింద రెండు సెంట్ల ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.80లక్షలు ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీకేపల్లె అభివృద్ధి విస్మరించారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో సీసీరోడ్లు వేయించి అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు.