రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక చేనేతలకు చేయూత నిస్తోంది. దీంతో చేనేత రంగంపై ఆధారపడిన నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం లో చేనేత రంగం అభివృద్దికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభు త్వం నేతన్నలకు 100లోపు యూనిట్లు ఉచిత విద్యుత పథకం అమలు చేసింది. చేనేత కార్మి కులకు జీరో విద్యుత బిల్లులు రావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత పొంద డానికి అర్హులైన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులకు నేతన్నలకు ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తుంపు కార్డు, ఆధార్‌కార్డు వంద యూనిట్ల లోపల వచ్చిన విద్యుత బిల్లు తోపాటు చేనేత కార్మికుడిగా ఉన్న ఫొటోతో కూడిన దరఖాస్తును సమీపంలోని సచివాలయం లేదా కరెంటు ఆఫీస్‌లో ఇవ్వాలి. రెండు మూడు రోజుల్లో ఆప్రాంతపు లైనమెన విచారణ చేసి అర్హులుగా గుర్తిస్తారు. గత అక్టోబరు, నవంబరు లో దరఖాస్తు చేసుకున్నవారికి విద్యుత బిల్లు జీరో రావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.