ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినన బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్లో మంగళవారం కోరారు. 2017లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. దాని ఆధారంగా తక్షణమే బోయ, వాల్మీకులకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ వాల్మీకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బోయ, వాల్మీకులు ఒక ప్రాంతంలో బీసీలుగా మరో ప్రాంతంలో ఎస్టీలుగా ఉన్నారని, రాష్ట్రం అంతటా ఎస్టీలుగానే పరిగణించాలని కోరారు. వడ్డెర్లను కూడా ఎస్టీలుగా గుర్తించాలని కోరారు.