AP: బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిందన్నారు. పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమన్నారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు.