గిరిజన విద్యార్థులు మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ట్రైబల్ రైట్స్ పోరం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ఐ. రామకృష్ణ అన్నారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ.. దొరజమ్మ ఆశ్రమం పాఠశాల విద్యార్థి మరణం బాధాకరమని మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షలు పరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.