పేద దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బొండపల్లి ఎస్సై యు.మహేష్ ను మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు మంగళవారం రాత్రి కలిసారు.
ఇటీవల మండలంలో ఉన్న రోళ్లవాక గ్రామంలో నమోదు అయిన కుల దూషణ కేసులో పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మానవ హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని తెలిపారు.