యూపీలోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఈ నెల 12న రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత యువకుడిని పట్టించుకోకుండా కారు ముందుకు వెళ్లిపోయింది.
ఇక ఆ కారు హైవేపై రివర్స్‌లో వస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. అంతేకాకుండా ఆ కారు పోలీసుల వాహనంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాధిత యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించలేదు.