కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్పల్లి, బంగరుపల్లి గ్రామ శివారులో గల తెలంగాణ ఉప పీఠంలో గురువారం రోజున కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల నుండి భక్తులు భారీ ఎత్తున పాల్గొని రామనందా చార్య శ్రీ స్వామి నరేంద్ర చార్య మహారాజ్ దర్శనం చేసుకుని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
అనంత శ్రీ విభుశిత్ జగద్గురు రామనంద చార్య శ్రీ స్వామి నరేంద్ర చార్య మహారాజ్ ఉప పీఠంలో కూర్చొని మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన ఉండాలి కానీ చెడు చేయాలని ఆలోచన ఉండకూడదు. హిందూ ధర్మాన్ని గౌరవించాలని దైవ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. అలాగే శుక్రవారం రోజున కూడా దర్శన కార్యక్రమము ఉంటుంది. అని అన్నారు. స్వామివారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు.