బంగారం ఈ మాట వినగానే మన దేశంలో అందరి కళ్లూ మెరుస్తాయి. అలంకరణ కోసం మహిళలతో పాటు పురుషులు కూడా బంగారం కొనాలని తహతహలాడతారు. వీలైనప్పుడల్లా బంగారం కొని దాచుకుంటే ఆపదకాలంలో ఆడుకుంటుంది అని ఎక్కువ మంది భావిస్తారు. ఇక పెళ్లిళ్ల వంటి శుభసందర్భాల్లో బంగారం లేకుండా కార్యక్రమం జరగదు. వధూవరులకు చేయించే నగల దగ్గర నుంచి కానుకలుగా ఇరు కుటుంబాల మధ్యలో బంగారం ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. అందుకే మన దేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్. అయితే, బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఉదయం ఉన్న ధర సాయంత్రానికి మారిపోతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది అంతర్జాతీయంగా వచ్చే మార్పులు. ఉదాహరణకి ఎక్కడైనా యుద్ధ వాతావరణం లేదా ఏ దేశంలోనైనా రాజకీయ పరిణామాలు మారె పరిస్థితి ఉంటే కూడా బంగారం ధరలు ప్రభావితం అవుతాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ కూడా ధరలు మారడానికి కారణంగా ఉండొచ్చు. అలాగే స్థానికంగా కూడా ఉండే డిమాండ్ ఆధారంగా ఆయా నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో బంగారం కొనాలని అనుకునేటప్పుడు ధరల గురించి పరిశీలించడం మంచిది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. కానీ మన దేశంలోనూ బంగారం ధరలు తగ్గుదల కనిపిస్తుంది. హైదరాబాద్ లో బంగారం ధరలు నిన్నటి కంటే భారీగా పడిపోయాయి. ఈరోజు అంటే 21.12.2024న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకపై 300 రూపాయలు తగ్గి 70,400 రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధరపై 330 రూపాయలు తగ్గి 76,800 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో వెండి విషయానికి వస్తే వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కసారే ఏకంగా 1000 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 98,000 రూపాయల వద్ద ఉంది. మన తెలుగురాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల విషయానికి వస్తే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా బంగారం, వెండి ధరలు కాస్త అటూ ఇటూగా ఇలానే ఉన్నాయి. అదేవిధంగా దేశరాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకపై 300 రూపాయలు తగ్గి 70,050 రూపాయలుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధరపై 330 రూపాయలు తగ్గి 76,350 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ఢిల్లీలో 90,500 రూపాయలకు చేరుకుంది. ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే 21.12.2024 ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా వచ్చే మార్పులు, స్థానికంగా ఉండే డిమాండ్, స్థానిక పన్నులు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బంగారం, వెండి కొనాలని అనుకునేటప్పుడు మీ ప్రాంతంలో రెండు మూడు దుకాణాల్లో వెరిఫై చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మహాన్యూస్ సూచిస్తోంది.