ఏపీలో కొత్త సంవత్సరం వేళ మందు బాబులకు మంచి కిక్కు ఇచ్చే వార్త. మద్యం కంపెనీలు మరి కొన్ని ఏపీలో ధరలు తగ్గించేందుకు నిర్ణయించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చింది. కొత్త మద్యం పాలసీ మేరకు కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. ధరల విషయంలోనూ వస్తున్న ఫిర్యాదు లతో ప్రభుత్వం అలర్ట్ అయింది. కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు ధరలు తగ్గించగా.. తాజాగా మరో 11 కంపెనీలు తమ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల తగ్గిస్తూ నిర్ణయం ఏపీలో మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సమయం నుంచి అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. అధిక ధరలు, బెల్టు షాపుల నిర్వహణ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. వీటిని నియంత్రించేందుకు మద్యం దుకాణాలకు హెచ్చరికలు చేసింది. అధిక ధరలకు విక్రయించినా, బెల్టు షాపులను ప్రోత్సహించినట్లు గుర్తిస్తే తొలి సారిగా జరిమానా, ఆ తరువాత లైసెన్సు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. అటు మద్యం విక్రయాలను ఎక్సైజ్ శాఖ గమనిస్తోంది. అదే సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం బెల్టు షాపుల పైన అలర్ట్ అయింది. రూ 30 వరకు తగ్గింపు ఇక, గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం ప్రస్తుతం ఏపీలో అందుబాటులోకి వచ్చింది. రూ 99 కే క్వార్టర్ మద్యం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ లో మద్యం అమ్మ కాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నార నే ఫిర్యాదులు ఉన్నాయి. ధరలు తగ్గింపు విషయంలో ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో వరుసగా చర్చలు చేసింది. కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు మరో 11 కంపెనీలు తాము అందించే మద్యం ధరల ఎమ్మార్పీ దాదాపు రూ 30 మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. మద్యం తాజా ధరలు దీంతో, ఏపీలో పలు రకాల మద్యం ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కు తగ్గింది. అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర రూ.440 నుంచి రూ.380, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కు తగ్గించారు. రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210 తగ్గింది. ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కు తగ్గించారు. యాంటిక్విటి బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ. 1600 నుంచి రూ.1400 తగ్గించారు. ఇప్పుడు మరిన్ని కంపెనీలు మద్యం ధరలు ముందుకు రావటంతో వాటి ఉత్పత్తుల ధరలను ఖరారు చేసారు. ప్రతీ దుకాణం వద్ద ధరల పట్టిక ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.