ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌లో మంగళవారం పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గటంతో వాతావరణం బాగా చల్లబడింది.స్టార్ లేక్, బ్రయంట్ పార్క్, కీళ్‌భూమి తదితర ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మంగళవారం ఉదయం కొడైకెనాల్ లేక్ ప్రాంతం, జింఖానా, కీళ్‌భూమి, బ్రయంట్ పార్కు ప్రాంతాలు మంచుతో నిండి పర్యాటకులకు వెండి పరచుకున్నంత అనుభూతి కలిగిస్తోంది.ప్రస్తుతం విద్యార్థులకు సెలవులు కావడం, వరుసగా క్రిస్మస్, న్యూఇయర్ సెలవులు తోడవతుండటంతో కొడైకెనాల్‌కు మూడు రోజులుగా పర్యాటకులు వవస్తున్నారు. స్టార్ లేక్ వద్ద మంచుకురుస్తున్నా లెక్కచేయకుండా ఆ సరస్సు నడుమ ఉన్న ఫౌంటెన్ తిలకిస్తూ పడవ సవారీ చేస్తున్నారు. ఇదే విధంగా ఆ లేక్ చుట్టూ హార్స్ రైడింగ్, సైకిల్ రైడింగ్ చేయడానికి పర్యాటకులు పోటీపడ్డారు.