తెలుగు రాష్ట్రాలలో రైతులను టమాట నిండా ముంచింది. పలు మార్కెట్‌లలో ఆదివారం టమాట ధర పతనమై ఐదు రూపాయలు పలికింది. మదనపల్లి, పత్తికొండ మార్కెట్‌లలో ఇదే పరిస్థితి నెలకొంది.
అటు వరంగల్ జిల్లాలోనూ టమాట ధర నేలచూపులు చూస్తోంది. నెలక్రితం ఇక్కడ కిలో 150 రూపాయలు పలికిన ధర.. ఇప్పుడు 5 రూపాయలకు పడిపోయింది. దీంతో టమాటలను రోడ్లపై పారబోస్తున్నారు రైతులు.