ఎవరికి కష్టం వచ్చినా.. వారి వెన్నంటే ఉండి కాపాడుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ పల్నాడు జిల్లా యల్లమంద లో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మాటాడుతూ..
గత ప్రభుత్వంలో సీఎం జిల్లాల పర్యటనకు వస్తే.. పరదాలు ఏర్పాటు చేసేవారని, చెట్లు కూడా కొట్టేవాళ్లని కామెంట్ చేశారు. నేడు నాపై ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు. తాను సాదాసీదాగా..ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు. మీ మిత్రుడిగా.. శ్రేయోభిలాషిగా వచ్చానని అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా కాపాడుకుంటానంటూ ఎమోషన్ అయ్యారు.నీరుపేదల జీవితాల్లో వెలుగు చూడాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. తాను కష్టపడేది తన కోసం కాదని.. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసమని చంద్రబాబు అన్నారు. పేదల ఇళ్ల పెండింగ్ బిల్లులను కూడా గత సర్కార్ చెల్లించలేదని ఫైర్ అయ్యారు. త్వరలోనే ఇళ్ల పెండింగ్ బకాయిన్నీ క్లీయర్ చేస్తామని పేర్కొన్నారు.