AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబీకులు ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేశారంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కబ్జా వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భూకబ్జాలపై వెంటనే విచారణ చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. దాంతో సంబంధిత అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారు.