పశ్చిమ గోదావరి జిల్లా, తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఇవాళ కారుమూరి మీడియాతో మాట్లాడారు.. పశువధ కర్మాగారం మూయించటానికి తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. రోజుకి నాలుగు వందల పశువులను వధించటానికి ఇలాంటి పరిశ్రమ ఇరవై ఎకరాల్లో ఉండాలని, కానీ కేవలం మూడెకరాల్లో జనావాసాల మధ్య నడుపుతుంటే ఎందుకు అడ్డకోరని ప్రశ్నించారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి కొంతమందికి తొత్తులా వ్యవహరిస్తున్నాడని కారుమూరి మండిపడ్డారు. అసలు అనుమతులు లేని ఫ్యాకరీకి పోలీసులు ఎలా కాపలా కాస్తారని ప్రశ్నించారు.