విశాఖ సెంట్రల్ జైలు వివాదం నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత నేడు స్వయంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జైలులో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతోందన్నారు. ఫోన్లు ఎవరు వినియోగిస్తున్నారో త్వరలో తేల్చుతామన్నారు.
జైలులో గంజాయి మొక్క కనిపించిందని చెప్పారు. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. తనిఖీల్లో కొన్ని విషయాలు తెలిశాయని వివరించారు.