బడికి వెళ్లే రోజుల్లో..చదవకపోయిన, అల్లరి చేసిన టీచర్ గుంజీలు తీయిస్తే పెద్ద శిక్షలా భావించేవాళ్లం. కానీ, ఆధునిక వైద్య పరిశోధనల్లో ఇదో వరం అంటున్నారు.
ఎందుకంటే..గుంజిళ్లు పిల్లలకు ఏకాగ్రతను పెంచేందుకు చక్కని వ్యాయామం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల మెదడు చైతన్యంగా మారి మతిమరుపూ తగ్గిస్తుందట. అందుకే అమెరికా-ఆస్ట్రేలియాలో సూపర్ బ్రెయిన్ యోగా పేరుతో అందరూ ఈ సాధనను చేస్తున్నారు.