గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.అయితే మరణానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్ ALH ధృవ్ హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సాధారణ శిక్షణా విమానంలో కూలిపోయిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారి తెలిపారు.గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు వస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తిందని, ఆ తర్వాత అది కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్‌లతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.భూమిని ఢీ కొట్టిన వెంటనే హెలికాప్టర్‌లో మంటలు చెలరేగడంతో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, రెండు నెలల క్రితం కూడా ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరిగింది.