రాజస్థాన్‌లోని జైపూర్- జైసల్మేర్ మధ్య నడుస్తున్న లీలన్ ఎక్స్‌ప్రెస్(12468)లోని ఏసీ కోచ్‌లో రిజర్వేషన్ చేయించుకున్న 64మంది ప్రయాణికులకు.. తమ కోచ్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే రైల్వే అధికారులకు ప్రశ్నించగా..ఈ రైలులో థర్డ్ ఏసీ కోచ్ సౌకర్యం ఉండదని తెలియజేశారు.
అలాంటప్పుడు థర్డ్ ఏసీ టికెట్లు ఎందుకు జారీచేశారని ప్రయాణికులు ప్రశ్నించడంతో..వారు అదనంగా చెల్లించిన సొమ్మును వాపసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.