ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ‘‘ఉక్రెయిన్‌పై దాడులకు దిగుతున్న రష్యా-ఉత్తర కొరియా సైనికులు మా సైన్యం చేతుల్లో ఓటమిని చవిచూస్తున్నారు’’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.
రష్యాలోని దక్షిణ కుర్స్క్ ప్రాంతంలో రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో తమ సైనికులు భారీగా విరుచుకుపడడంతో అక్కడి బలగాలకు భారీ ప్రాణనష్టం సంభవించిందని పేర్కొన్నారు.