ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, ఎన్జీవో రాష్ట్ర నాయకులు శివారెడ్డి, సాగర్, పురుషోత్తం నాయుడులను డెమొక్రటిక్ పీఆర్టీయూ ప్రతినిధులు గురుగుబెల్లి దామోదర్ రావు, పారుపల్లి శ్రీనివాసరావు, అంపోలు లోకనాథం ఎచ్చెర్లలో ఆదివారం కలిశారు. వారిని శాలువాలతో సత్కరించి, పూల బొకేలు అందించారు. డిపిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను ఉపాధ్యాయ సేవాదళం సేవలపై వివరించి సహకారం కోరగా నేతలు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.