AP: ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కియా పరిశ్రమను తీసుకొచ్చింది చంద్రబాబే. వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయి. గాడితప్పిన పాలనను సరైన దారిలో పెడుతున్నాం. విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తాం.’ అని లోకేశ్ అన్నారు.