భట్టిప్రోలు మండలం సూరేపల్లి పంచాయతీ పరిధిలోని తాతావారిపాలెం గ్రామంలో వైయస్ఆర్సీపీ అభిమాని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. పడమటి శేషగిరిరావు శనివారం భట్టిప్రోలు పరిధిలోని పంట పొలాల్లో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు.
పంట పొల్లాలో పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలు గుర్తించి అధికారులకు సమాచారం తెలియజేశారు. సమాచారం మేరకు కుటుంబ సభ్యులు, బంధువులు 108 వాహనంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న వైయస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు రేపల్లె ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన వెంట వైయస్ఆర్సీపీ నాయకులు పడమటి శ్రీనివాసరావు, జంగం వాసు, బొల్లెద్దు ప్రతాప్, వాకా అంకబాబు, మోర్ల సత్యనారాయణ, పీజీ అరుణ్శాస్త్రి, పడమటి సాయి, రావు చంద్రశేఖరరావు, యన్నం సురేష్ ఉన్నారు.