ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తమ చెరలో బందీలుగా ఉన్న వ్యక్తుల వీడియోలను హమాస్ విడుదల చేస్తోంది.
ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సైనికురాలు లిరి అల్బాగ్ వీడియోను హమాస్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోలో అల్బాగ్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. 450 రోజులకుపైగా తాను హమాస్ చెరలో బందీగా ఉన్నానని, తనని రక్షించాలని ఇజ్రాయెల్ నాయకులకు విజ్ఞప్తి చేసింది.