బిలేటెడ్/ రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువును ఆదాయపు పన్ను విభాగం పొడిగించింది. నేటితో గడువు ముగియనుండగా.. భారత నివాసితులకు 2025 జనవరి 15 వరకు అవకాశం కల్పించింది.
జులైలో ఎవరైతే ఐటీఆర్ దాఖలు చేయలేదో వారు జరిమానా చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే గడువు లోపు ఐటీఆర్ సమర్పించినా ఒకవేళ అవసరమైతే రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలనుకున్నవారూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.